బోధన్‌లో ఘనంగా 100వ సైకిల్ ర్యాలీ

29-11-2026 | 05:16pm

డ్రగ్స్ దుష్పరిణామాలపై యువతకు సీఐ అవగాహన

బోధన్, నవంబర్ 29 (విజయక్రాంతి): MY భారత్ నిజామాబాద్(India, Nizamabad) ఆధ్వర్యంలో 100వ ‘సండేస్ ఆన్ సైకిల్(Sundays on a Bicycle)’ కార్యక్రమాన్ని ఆదివారం బోధన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College) నుంచి ఆచన్‌పల్లి(Achanpalli) వరకు సైకిల్ ర్యాలీ(Cycle Rally) చేపట్టారు. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు వ్యాయామం, సైక్లింగ్ ప్రాధాన్యతను తెలియజేయడమే కార్యక్రమం లక్ష్యంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బోధన్ సీఐ వెంకట నారాయణ యువతకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే 1908 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి అథ్లెట్ రెహాన్, MY భారత్ వాలంటీర్లు సాయికుమార్, విశాల్, వాసు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు