హనుమాన్ ధర్మశాలకు రూ.11 లక్షల విరాళం

29-11-2026 | 05:23pm

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారం

బోధన్, నవంబర్ 29 (విజయ క్రాంతి): ఎడపల్లి గ్రామంలోని(Edapalli Village) వీర హనుమాన్ మందిరం వద్ద నిర్మిస్తున్న ధర్మశాల నిర్మాణానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy) రూ.11 లక్షలు కేటాయించారు. ఆదివారం ధర్మశాల(Dharmashala) నిర్మాణ పనులను సందర్శించిన ఆయనకు నిర్మాణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు ధర్మశాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

వారి విజ్ఞప్తికి స్పందించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన వంతు సహాయంగా రూ.11 లక్షలు కేటాయించారు. దీంతో ధర్మశాల నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధర్మశాల నిర్మాణానికి ఆయన అందించిన సహకారం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు