గౌడుల సంక్షేమానికి సీఎం రేవంత్ ప్రాధాన్యం

29-11-2026 | 05:30pm
  1. బహుజన సామాజిక పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
  2. ట్యాంక్ బండి మీద సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేశాం...
  3. పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలి
  4. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 

సుల్తానాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): గౌడ కులస్తుల సంక్షేమానికి(Welfare of the Goud community) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పెద్దపీట వేశారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(Chintakunta Vijaya Ramana Rao) అన్నారు, ఆదివారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని పాత జెండా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న(Sardar Sarvai Papanna) విగ్రహావిష్కరణ కార్యక్రమానికి  విజయ రమణారావు ముఖ్యఅతిథిగా హాజరై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని గౌడ సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు నేతలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు  మాట్లాడుతూ గౌడ అన్నల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు, సర్దార్ సర్వాయి పాపన్న ఒక గౌడ సామాజిక వర్గానికే కాకుండా బహుజన విప్లవకారుడని కొనియాడారు. ఆనాటి నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించి ఒక సైన్యం గా ఏర్పడి వారిని మట్టు పెట్టి దాదాపు 18 కోటలను జయించిన గొప్ప ధీరుడు అని, గోల్కొండ కోటను జయించి గోల్కొండ కోట పై జెండా ఎగురవేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.

అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న ను గుర్తించి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ , శ్రీధర్ బాబు ,పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  చొరవతో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. అలాగే గౌడ అన్నల కోసం రాష్ట్రవ్యాప్తంగా కాటమయ్య మోకులను అందజేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గౌడ లకు ప్రాధాన్యత నిచ్చి ఎక్కువ పింఛన్లు అందజేశామని స్పష్టం చేశారు.

అంతేకాకుండా గౌడ లకు వికలాంగ, వృద్ధుల పింఛన్లు  మంజూరు చేశామని తెలిపారు. గౌడ అన్నలు తీస్తున్నటువంటి తెల్ల కళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిదని, గౌడ ల సూచన మేరకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి త్వరలో నీర ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. గౌడ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం గౌడ సంఘం  నేతలు విజయ రమణారావు ను ఘనంగా సన్మానించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు కృషిచేసిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సింగల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్,వేగోళం పద్మ అబ్బయ్య గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ మినుపాల  ప్రకాష్ రావు ,మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, బుర్ర శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు ఆయిల  రమేష్ , ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు మామిడిపల్లి బాపయ్య , గౌడ సంఘం సీనియర్ నాయకులు పెద్దంపేట శంకర్, సింగం సత్తన్న , వెంకన్న,

మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత, మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత, వార్డు కౌన్సిలర్లు గాజుల రాజ మల్లయ్య, కందునూరి సమత, ఉట్ల వర ప్రదీప్, తొర్రి కొండ ప్రభాకర్, గౌడ సంఘం అధ్యక్షులు పోన్నం తిరుపతి గౌడ్, స్థానిక నాయకులు పులి రమేష్ గౌడ్, మంద శ్రీనివాస్ గౌడ్, బత్తిని కృష్ణ గౌడ్, అంతటి సంతోష్ గౌడ్, సర్పంచులు వీరగోని రమేష్ గౌడ్, పోచంపల్లి చిన్నయ్య, నీరు కుల్ల ఉప సర్పంచ్ దాసరి సతీష్, మూల సత్యం, బైరి రవి గౌడ్, సురేష్,

కరుణాకర్ గౌడ్, వేగోళం కరుణాకర్ గౌడ్, కొయ్యడ రమేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు పన్నాల రామన్న, అమిరిశెట్టి రాజలింగం, కుమార్ కిషోర్, అమిరిశెట్టి తిరుపతి, మాజీ వార్డు సభ్యురాలు అంతటి శంకరమ్మ, అంతటి చిరంజీవి, నీరుకుల్ల మాజీ సర్పంచ్ కోటగిరి విజేందర్ గౌడ్, బురుగు అంజయ్య గౌడ్, బైరగోని రవీందర్ గౌడ్, బైరగోని ప్రభాకర్ గౌడ్ తో పాటు మండలంలోని వివిధ కుల సంఘాల నాయకులు గౌడ సంఘం కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు