సోనాల మండల కేంద్రంలో రోడ్లపైనే వాహనాల పార్కింగ్

29-11-2026 | 05:09pm

ఇబ్బందులు పడుతున్న జనం. 

బోథ్ నవంబర్ 29 ( విజయక్రాంతి): నూతనంగా ఏర్పడ్డ సోనాల మండల(Sonala Mandal) కేంద్రం దినదినం వ్యాపార(Business) పరంగా అభివృద్ధి చెందు తున్నది. దీనికి తోడు మండల కేంద్రంలో వాహనాల పార్కింగ్ రోడ్ల పక్కనే ఉండడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు వ్యాపారాలు రోడ్లకు సమీపంలోని ఉండడం వల్ల వివిధ పనుల నిమిత్తం వచ్చినవారు తమ వాహనాలను రోడ్ల పక్కనే ఉంచడంతో భారీ వాహనాలు వచ్చినప్పుడు రోడ్లపైనే నిలిపి వేస్తున్నారు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇవ్వాలని గురవుతున్నారు. 

రోడ్ల పైన వ్యాపారం

మండల కేంద్రంలో వ్యాపారస్తులు కొందరు తమ వ్యాపారాన్ని రోడ్డుకు ఆనుకొని నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు రోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు. సొంత రోజున శివాజీ విగ్రహం చుట్టూ వ్యాపార వర్గాల వారు తో ఉండడంవల్ల బస్సుల కోసం వేచి చూసేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు వచ్చినప్పుడు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని ప్రయాణికులు ఆపుతున్నారు.....

వ్యాపారం కోసం వచ్చిన వాహనాలు రోడ్డుపైనే

వివిధ రకాల సరుకులను తీసుకువచ్చిన వాహనాల వారు రోడ్లపైనే పార్కింగ్ చేసి తమ సరుగును షాపుల వారికి అందిస్తున్నారు. ఈ సమయంలో వాహనాలు వస్తే ప్రజలు వెళ్లేందుకు స్థలం లేక సతమతమవుతున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ అధికారులు నియంత్రించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు