క్రిక్ 37 గల్లీ క్రికెట్ సెమీఫైనల్స్ ప్రారంభం
ముకరంపుర, నవంబర్ 29(విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు(bad addictions) దూరంగా ఉండి, మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కోసం క్రీడలను(Sports) జీవితంలో భాగంగా చేసుకోవాలని బీజేపీ(BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Yadagiri Sunil Rao) పిలుపునిచ్చారు. స్థానిక క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి గల్లీ క్రికెట్ టోర్నమెంట్లు(Gally Cricket Tournament) ఎంతో దోహదపడతాయని ఆకాంక్షించారు. కీర్తిశేషులు కోడూరి రవీందర్ గౌడ్ స్మారకార్థం 37వ డివిజన్ కార్పొరేటర్ ఏపీపీ చంద్ర ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 'క్రిక్ 37 గల్లీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2' సెమీ ఫైనల్ మ్యాచ్లు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదగిరి సునీల్ రావుతో పాటు వన్ టౌన్ సీఐ రామచంద్రరావు, టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి, త్రీ టౌన్ సీఐ తిరుమల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు టాస్ వేసి మ్యాచ్లను ప్రారంభించడమే కాకుండా, మైదానంలో స్వయంగా బ్యాట్ పట్టి కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు కార్పొరేటర్ ఏపీపీ చంద్ర ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో ఆడి తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సోమిడి వేణు ప్రసాద్, మాసం గణేష్, టోర్నమెంట్ నిర్వాహకులు, వివిధ జట్ల క్రీడాకారులు, స్థానిక నాయకులు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
End