వైభవంగా కుంకుమార్చన.. అమ్మవారి సన్నిధిలో భక్తుల పూజలు

15-10-2026 | 07:59pm

బేల అక్టోబర్ 15(విజయక్రాంతి): బేల పట్టణంలో ఏక్తా దుర్గ ఉత్సవ్ మండల్(Ekta Durga Utsav Mandalam) ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుంకుమార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు. కార్యక్రమంలో మండల్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు