కలుషిత నీరును శుభ్రం చేసిన అధికారులు
* స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్శి షా
* "విజయక్రాంతి" ఎఫెక్ట్...
ఉట్నూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కన్నాపూర్ గ్రామపంచాయతీ కేంద్రంలోని తాగునీటి బావిలోని నాచుతో కలుషిత నీటిని పంచాయతీ అధికారులు బుధవారం శుభ్రం చేయించారు. కన్నాపూర్ గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా ఏర్పాట్లు చేశారు. " విజయక్రాంతి " లో ప్రచురణ అయిన " ఒకే బావి.. 15 మోటార్లు.. 45 గృహాలు " కథనం ప్రచురణ అయింది.
ఈ కథనానికి జిల్లా కలెక్టర్ రాజర్శి షా(District Collector Rajarshi Shah) స్పందించి వెంటనే బావిలోని నాచును శుభ్రం చేయడంతో పాటు గిరిజనులకు స్వచ్ఛమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి రమేష్ సిరికొండ మండల ఎంపీ ఓ సంతోష్ ను ఆదేశించడంతో ఎంపీ ఓ సంతోష్ కన్నాపూర్ గ్రామానికి వెళ్లి కలుషితమైన నీటిని స్వచ్ఛమైన తాగునీరు అందే విధంగా నీటిలో బ్లీచింగ్ పౌడర్ వేసి బావిని శుభ్రం చేశారు. తాగునీటి బావిలో కలుషిత నీరును శుభ్రం చేయించుటకు కృషిచేసిన విజయ క్రాంతి దినపత్రికకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.