పంచాయతీరాజ్ ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

04-11-2026 | 11:01pm

కల్హేర్ నవంబర్ 04 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని బీబీపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి రంగులు వేస్తే, కార్యాలయ మరమ్మతులు చేసినట్లు తప్పుడు ఎంబీ రికార్డు నమోదు చేసిన పంచాయతీరాజ్ ఏఈ వినయ్ కుమార్‌(Panchayat Raj AE Vinay Kumar)పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు, గ్రామస్తులు కోరారు. కేవలం 30 వేల రూపాయలు ఖర్చయిన పనులకు ఏకంగా 1.25 లక్షల ఎంబీ రికార్డు చేయడం తగదని మండిపడ్డారు.

పాలకవర్గం సైతం రంగులు వేయడానికి తీర్మానం చేసిందని ఏఈ మాత్రం పంచాయతీ భవనం మరమ్మతులు చేసినట్లు ఉన్నవి లేనివి కలిపి ఎంబి రికార్డు చేశారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఏఈపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు, వార్డు సభ్యులు యెన్నం అనిల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చంద్రశేఖర్, అశోక్, సందీప్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు