కూతురు పెళ్లి బెంగతో ఒకరి ఆత్మహత్య
ఉట్నూర్, నవంబర్ 12( విజయక్రాంతి ): ఇంద్రవెల్లి మండలం లోని ముత్నూర్ గ్రామానికి చెందిన దేవలవార్ హేమంత్(Devalwar Hemant)(50) మూడో కూతురు పెళ్లి ఎలా చేయాలనే బెంగతో ఇంట్లో గురువారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంద్రవెల్లి ఏఎస్ఐ గంగారెడ్డి(Indravelly ASI Gangareddy) ఓకే తెలిపిన వివరాల ప్రకారం వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తున్నారని అన్నారు.
డ్రైవర్ గా ప్రైవేటు వాహనాలపై అవకాశాలు రాకపోవడంతో పాటు పెండ్లికి వచ్చిన మూడో బిడ్డ పెళ్లి ఎలా చేయాలని బెంగతో ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. ఇద్దరు కూతుర్ల పెళ్లి చేసి అప్పులయ్యాయని, అప్పులు తీరుస్తేనే , తిరిగి అప్పులు ఇచ్చేందుకు ముందుకు వస్తారని ఆలోచిస్తూ.. ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వివరించారు.