రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు గురుకుల ఎంపిక
జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి సత్తా చాటిన విద్యార్థులు
చివ్వెంల,(విజయక్రాంతి): క్రీడారంగంలో చివ్వెంల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని జనగాం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించిన 12వ జోనల్ స్థాయి సెలక్షన్ ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.
ఈ పోటీల్లో అండర్-14 విభాగంలో 8వ తరగతికి చెందిన డి. చరణ్, కె. భార్గవ్ క్యారమ్స్‌లో, టి. ప్రణయ్ టెన్నికాయిట్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్-17 విభాగంలో 10వ తరగతికి చెందిన బి. గణేష్ ఖోఖోలో, పి. హరీష్, ఎం. వెంకట్ హ్యాండ్‌బాల్‌లో, కె. లోకేష్ వాలీబాల్‌లో ఎంపికయ్యారు.
అండర్-19 విభాగంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థి జె. దినేష్ చెస్‌లో, ఎంపీసీ విద్యార్థులు పి. సంజయ్, బి. హరీదీప్ 800 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
వివిధ క్రీడా విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ జి.వి. విద్యాసాగర్, పీడీ కృష్ణారెడ్డి, పీఈటీ రహీం, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.