ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్ ప్రారంభం

12-11-2026 | 04:51pm

కలెక్టర్ చొరవతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సౌజన్యంతో కంప్యూటర్లు మంజూరు:సర్పంచ్ మహేష్ యాదవ్ 

గంభీరావుపేట, నవంబర్ 12 (విజయ క్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు(Digital education in government schools) అడుగులు పడ్డాయి. జిల్లా కలెక్టర్ చొరవతో,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సౌజన్యంతో మంజూరైన డిజిటల్ క్లాస్‌రూమ్, కంప్యూటర్లను గ్రామ సర్పంచ్ చేకూటి మహేష్ యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు డిజిటల్ క్లాస్‌రూమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పాఠశాలకు కంప్యూటర్లు మంజూరు చేయించేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌కు గ్రామ పాలకవర్గం, గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు