అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

12-11-2026 | 04:54pm

జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): పర్యావరణం, వన్యప్రాణులను కాపాడుకుంటూ అటవీ శాఖ(Forest Department) అనుమతులతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో(Collectorate) నిర్వహించిన జిల్లాస్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.

అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ, స్వయం సహాయక సంఘాల భవనాలు, రహదారుల నిర్మాణాలకు అటవీ అనుమతులు పొందాలని సూచించారు. భూముల రీ సర్వేలో అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో సరిహద్దు సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో మంద మకరంద్, డీఎఫ్‌వో బాలమణి, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మట్, ఎం.డేవిడ్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు