పవన్‌పై అనుచిత పోస్టులు.. యువకుడు అరెస్ట్
పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై( Pawan Kalyan) సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో ఓ యువకుడిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన కూరపాటి రవీంద్రబాబును బుధవారం పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత నెల 13న పిఠాపురానికి చెందిన జనసేన నాయకులు ఇచ్చిన Complaint ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా(Social Media) పోస్టులకు సంబంధించి ఫిర్యాదు అందడంతో పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని గుర్తించినట్లు సీఐ సత్యనారాయణ వెల్లడించారు. అనంతరం ప్రత్యేకంగా నిఘా పెట్టి రవీంద్రబాబును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో Social Media Activity, పోస్టుల వివరాలు, ఇతర ఆధారాలపై విచారణ కొనసాగుతోంది. ఆన్లైన్లో అభిప్రాయాలు వ్యక్తం చేసే సమయంలో చట్టపరమైన పరిమితులను పాటించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.