తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చింది మేమే

14-10-2026 | 04:42pm

బోథ్. అక్టోబర్ 14 (విజయ క్రాంతి): సోనాల మండల కేంద్రంలో తెలంగాణపబ్లిక్ స్కూల్(Telangana Public School) కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిందని ఆ పాఠశాల మంజూరి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) కృషి చేశారని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు చౌహన్వినోద్ సింగ్, డిసిసి కార్యదర్శి లోలపు పోసెట్టిలు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుల కృషి వల్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు అయితే బి.ఆర్.ఎస్ నాయకులు పాలాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పబ్లిక్ స్కూల్ మంజూరికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తోపాటు జిల్లానాయకుల చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.

తప్పుడు ప్రచారాలు చేసుకొని లబ్ధి పొందాలని చూడడం సరైనది కాదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి చౌహాన్ హరి సింగ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుడాల అనీష్, మండల సర్పంచులు గైక్వాడ్ శ్రీరామ్, రమాదేవి భీమ్రావు, పూజా సంగ్రామ్మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జూన్గాల భోజన్న మునేశ్వర సోమన్న, వార్డు సభ్యులు అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బాసెట్టి సుదర్శన్ మైనార్టీ మండల అధ్యక్షులు షేక్ ఇబ్రహీం ఆత్మ డైరెక్టర్ శ్రీధర్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు