విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నుల పంపిణీ
మాసం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన మాసం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ తన అన్న కుమార్తె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బాలుర ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. తన అన్న కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ప్రతి ఏడాది మాసం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాస్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు మడాలి శ్రీనివాసరావు, శ్రీను, వెంకట్, ఆసిఫ్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.