గుస్సాడీలతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
06-11-2026 | 03:46pm
తలమడుగు నవంబర్ 6 (విజయక్రాంతి): పల్సీ (కే) గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గుస్సాడీ కళాకారుల సంప్రదాయ నృత్యాలను ఆసక్తిగా తిలకించిన ఎమ్మెల్యే, వారితో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. కళాకారులతో కలిసిపోయి సందడి చేయడంతో ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.