బాధితుడికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
06-11-2026 | 05:08pm
తాడ్వాయి,నవంబర్,06( విజయక్రాంతి ) : కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మైపాల్ రెడ్డి(Maipal Reddy) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన హైదరాబాదులోని ఆసుపత్రిలో(Hospital) చికిత్స నిర్వహించుకుని ఇంటికి వచ్చారు.ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Jajala Surender) శుక్రవారం ఆయనను పరామర్శించి ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సాయి రెడ్డి, రాజి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.