అత్తను ఇంట్లోంచి గెంటేసిన కోడలు

06-11-2026 | 04:47pm

జగిత్యాల, నవంబర్ 6 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం(Buggaram Mandal) గోపులాపూర్ కు చెందిన నార్నేని కౌసల్య(75) అనే వృద్ధ అత్త తన కోడలు పద్మ పోషణ, వైద్య ఖర్చులు పెట్టక కొట్టి ఇంట్లోంచి గెంటి వేసిందని జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించింది కాగా శుక్రవారం సీనియర్ సిటిజెన్స్ ప్రతినిధులతో వెళ్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

అనంతరం ఆ వృద్ధ అత్త సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో తన గోడు విలేకరులకు వినిపించారు. తన మరణించిన భర్త కిషన్ రావు పేరిట ఉన్న భూములను నా కోడలు పద్మ అక్రమంగా తన పేరిట పట్టా చేయించుకొని నన్ను పోషించాలని కోరితే నా కోడలు పద్మ, మనుమడు వాసురావులు కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టారని, నా కోడలు నా ఇంటిలో నన్ను ఉంచుకొని నన్ను పోషిస్తూ ప్రతి నెలా రూ. 10 వేలు పోషణ వైద్య ఖర్చులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, నా మరణించిన భర్త కిషన్ రావు పేరిట అక్రమంగా చేయించుకున్న భూముల పట్టా రద్దు చేసి తన పేరిట మార్పించాలని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ను ఆశ్రయించి ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా తన కోడలు, మనుమడి పై కేసు నమోదు చేశారని, ఎస్పీకి సైతం ఫిర్యాదు చేస్తానని ఆ వృద్ధ అత్త విలేకరుల ముందు ఏడుస్తు చెప్పింది. ఆ వృద్ధ అత్త వెంట ఆమె బంధువులు, సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, చట్టం కాన్సిలియేషన్ అధికారులు పి. సి. హన్మంత్ రెడ్డి, వెల్ముల ప్రకాష్ రావు, తదితరులున్నారు.

మరిన్ని వార్తలు