ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు

06-11-2026 | 04:00pm

నేరేడుచర్ల, నవంబర్ 06 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో నేరేడుచర్ల పట్టణ నాయీ బ్రాహ్మణులు ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి(Dhanvantari Jayanti)ని ఘనంగా నిర్వహించిన, అనంతరం పండ్లు, ఫలహారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణ కులదేవత ధన్వంతరి భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేదిక వైద్యాన్ని పరిచయం చేసి వైద్య నారాయణగా భారత దేశ ప్రజలు ఆయుర్వేదిక వైద్యం అందించారని, మొట్ట మొదటి సర్జన్ గా పేరు పొందినాడన్నారు.

ఆధునిక యుగంలో ప్రజల యొక్క ఆరోగ్యానికి ఆధునిక యుగంలో ఇప్పుడున్న వైద్య విధానానికి ముందుటనే నాయి బ్రాహ్మణులు ఆయుర్వేదికంగా మూలపురుషులుగా భారతదేశానికి వైద్యాన్ని అందించిన ధన్వంతరి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి నాయీ బ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడు కాపర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జంపాల శ్రవణ్, ఉపాధ్యక్షుడు రసమల్ల కృష్ణ గౌరవ అధ్యక్షులు మెగరాల సత్యనారాయణ, పయ్యావుల వెంకన్న, ఉపాధ్యక్షుడు తిరుమలగిరి నాగయ్య, నియోజకవర్గ యూత్ లీడర్ మిడిసిన మెట్ల సతీష్, సమ్మెట వెంకన్న, రాంప్రసాద్, కార్తీక్, వెంకన్న ఉపేందర్, వెంకన్న కృష్ణ  వీరబాబు మోగరాల ఉదయ్, నాగయ్య  వెంకన్న మిడిసిన మెట్ల నాగరాజు నరేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు