తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ఉండాలి..
తాడ్వాయి, నవంబర్ 06 (విజయక్రాంతి): తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ఉంటేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని వక్త, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు(Bandaru Sanjeevulu) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.విద్యార్థులు సెకండరీ స్థాయి నుంచి క్రమశిక్షణతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొర్ని నర్సింలు, ఉపసర్పంచ్ గడ్డం నర్సారెడ్డి,తాడువాయి, దేమికలాన్ సింగిల్ విండోల చైర్మన్ లు సంతాజీగారి సుధాకర్ రావు, ఏనుగు వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.