వేగవంతంగా రోడ్డు పనులు..

06-11-2026 | 04:03pm

తాడ్వాయి, నవంబర్ 06 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామం నుంచి గాంధారి రోడ్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) ప్రత్యేక చొరవతో రోడ్డు పనులకు రూ.20 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.

ఈ నిధులతో రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కలుగుతాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంజీవులు, తాడువాయి, దేమికలాన్ సింగిల్ విండోల అధ్యక్షులు సుధాకర్ రావు, వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు