తుకారాములు గారి ఆదర్శాలను అనుసరించాలి
ఆదివాసీ ముద్దుబిడ్డ తుకారం నువ్వు ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు విద్యావంతులు ఎదగాలి..
స్వర్గీయ మడావి తుకారాం ఐఏఎస్ గ28వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
ఉట్నూర్, నవంబర్ 29 ( విజయక్రాంతి ): ఆదివాసుల ముద్దుబిడ్డ ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad) జిల్లా ఆదివాసి గోండు తెగ(Adivasi Gond tribe) నుండి తొలి ఐఏఎస్ అధికారిగా(First IAS officer) ఎదిగిన మాడవి తుకారాం(Madavi Tukaram)ను ఆదర్శంగా తీసుకొని ఆదివాసి పిల్లలందరూ ఉన్నత చదువులు చదవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) పిలుపునిచ్చారు. ఆదివారం ఉట్నూరు మండలం ఉట్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఈ రోజు స్వర్గీయ మడావి తుకారాం ఐఏఎస్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లక్షెట్టిపేట్ గ్రామం లో వారి స్మారకార్థం నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదివాసీ సమాజం నుంచి తొలి ఐఏఎస్ అధికారిగా ఎదిగిన మడావి తుకారాం గారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ఆదివాసీ సమాజ అభ్యున్నతికి, ప్రజాసేవకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గిరిజన యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.