పోడు సాగుదారులపై ఫారెస్ట్ దాడులు ఆపాలి

14-10-2026 | 07:39pm

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో పోడుసాగు దారులపై ఫారెస్ట్ దాడులు ఆపాలని, ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని  వ్యవసాయ కార్మిక సంఘం(Agricultural Workers' Union) రాష్ట్ర ఉపాధ్యక్షులు బి పద్మ డిమాండ్ చేశారు. బుధ వారం సిఐటియూ కార్యాలయంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం(Agricultural Workers' Union) జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఉపాధి హామీ పనులు మున్సిపాలిటీలో కల్పించాలని, మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఉపాధి దొరకగా, ఇంటికి కిరాయి, పిల్లల విద్య, వైద్య ఖర్చులు కట్టలేక పేదలు అనేక ఇబ్బంది పడుతున్నారని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు మరింత పేదలుగా చేసే ప్రయత్నంలో భాగంగా, నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు.

ప్రజలకు గ్రామీణఉపాధి హామీలో కోత విధిస్తున్నారని, వీబీజీ రాంజీ రద్దు చేయాలని, కూలీలకు రూ. 800 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న  సంవత్సరానికి రూ. 12 వేలు అమలు చేయాలని, మహిళలకు రూ. 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనుక అశోక్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోమాత అశోక్, జయ, సత్యం, సమ్మక్క, శంకర్, కేత, స్వరూప, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు