ఎదులబాద్ డివిజన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా డొంకెని శంకర్ గౌడ్

14-10-2026 | 07:37pm

ఘట్ కేసర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ(Edulabad Division Congress Party) జనరల్ సెక్రటరీగా డొంకని శంకర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం నియామక పత్రాన్ని డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా శంకర్ గౌడ్ కు అందజేశారు. 

ఈ సందర్భంగా డొంకని శంకర్ గౌడ్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్(Edulabad Division Congress Party) జనరల్ సెక్రటరీగా నియమించినందుకు డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ కు అలాగే పదవి రావడానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ లకు  కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నావంతు కృషిని అందించనున్నట్లు  డొంకని శంకర్ గౌడ్ తెలిపారు.

మరిన్ని వార్తలు