పట్టభద్రుల ఎమ్మెల్సీ సమన్వయ సమావేశాన్ని విజయవంతం చేయాలి
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాళ్లపెళ్లి భాస్కర్‌రావు
గణపురం (విజయక్రాంతి): వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 15న మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సమన్వయ సమావేశాన్ని విజయవంతం చేయాలని గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపెళ్లి భాస్కర్‌రావు(Tallapelli Bhaskar Rao) పిలుపునిచ్చారు.
గురువారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. మండలం నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.