వీధి దీపాలకు విద్యుత్ మీటర్ ఏర్పాటు
30-10-2026 | 10:40pm
విజయక్రాంతి వార్తకు స్పందన..
బేల,(విజయక్రాంతి): మండలం జూనోని గ్రామం(Junoni Village)లో పట్టపగలే వీధి దీపాలు(Streetlights ) వెలుగుతూ విద్యుత్ వృథా అవుతున్న విషయంపై ‘విజయక్రాంతి’లో ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే చర్యలు చేపట్టి గ్రామంలోని వీధి దీపాలకు ప్రత్యేకంగా విద్యుత్ మీటర్ ఏర్పాటు చేశారు. దీంతో వీధి దీపాల విద్యుత్ వినియోగాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడంతో పాటు విద్యుత్ వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. వార్తా కథనానికి స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.