దుర్గామాతకు ఒక వంద ఎనిమిది బోనాలు

15-10-2026 | 11:59pm

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని పిప్పల్దరి గ్రామంలో దుర్గామాతకు గ్రామస్తులు ఒక వందఎనిమిది రకాల బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలోని మహిళలంతా ఒకరోజు ముందుగానే బోనాల సమర్పణ కార్యక్రమానికి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని గురువారం బోనాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో గ్రామ మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు