ఆటపాటలతో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

15-10-2026 | 11:53pm

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు కానిస్టేబుళ్ల నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల కోసం గురువారం సాయంత్రం హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో(Batukamma celebrations) వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత(Warangal Police Commissioner N. Shweta), సెంట్రల్ జోన్ డీసీపీ దార కవితతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్, సెంట్రల్ జోన్ డీసీపీలు స్వయంగా సంప్రదాయ పాటలను ఆలపిస్తూ, మహిళా సిబ్బందితో కలిసి నృత్యాలు చేస్తూ మహిళా పోలీసు సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... మనం ఎంత ఆధునిక జీవనశైలికి అలవాటు పడినా, మన మూలాలను, సంస్కృతి సంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్విరామంగా బాధ్యతలు నిర్వర్తించే పోలీసు సిబ్బందికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, హైదరాబాద్ వంటి మహానగరాలతో పోలిస్తే వరంగల్‌లోనే బతుకమ్మ ఉత్సవాలను ఎంతో ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.

అనంతరం వివిధ రకాల సహజసిద్ద పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మను తయారు చేసిన బరోసా సెంటర్ సిబ్బంది కి మొదటి బహుమతిని ఇస్తూ అలాగే బతుకమ్మ పాటలను పాడిన సుబేదారి పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ స్వప్నను కమిషనర్  అబినందిస్తూ, ఆమెకు ప్రత్యేక బహుమతి ప్రధానం చేశారు. సంప్రదాయానికి అనుగుణంగా, వినూత్న రీతిలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనులో మహిళా సిబ్బంది తమ బతుకమ్మలను నిమజ్జనం చేస్తూ భక్తిశ్రద్ధలతో గంగాప్రవేశం నిర్వహించి, గౌరమ్మకు భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.

మరిన్ని వార్తలు