సామూహిక కుంకుమార్చన

15-10-2026 | 11:44pm

వైశ్య భవన్ లో కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): హిందూ సంప్రదాయంలో దేవి నవరాత్రులలో అమ్మవారికి కుంకుమార్చన(Kumkumarchana) చేయడం వల్ల మనసు ప్రశాంతత పొందుతుందని, సకల ఐశ్వర్యాలు, దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తాయని భక్తుల బలమైన విశ్వాసం. ఇందులో భాగంగా స్థానిక వైశ్య భవన్ లో ని కన్యకా పరమేశ్వరి ఆలయం(Kanyaka Parameswari Temple)లో ఆర్యవైశ్య మహిళలు యువతులు ఉదయాన్నే హారతులు పట్టుకొని వాళ్ళ ఆయనకి చేరుకున్నారు. ఆలయ పూజారి కొండముట్ల రాజేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని కొనసాగించారు.

అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు అనంతరం ఒకరికొకరు మహిళలు, యువతులు వాయనం ఇచ్చుకున్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు సిద్ది శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో భోజనాలను ఏర్పాటు చేశారు. దాంతో పెద్ద ఎత్తున భక్తులు భోజనాలు ఆరిగించారు అనంతరం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వ్యాపారవేత్తలు మహిళలు యువతులు బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు