విద్యుత్ శాఖ ఏఈ నియమించాలని జిల్లా అధికారికి వినతి పత్రం
గొండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షడు పూనెం ప్రతాప్
సకాలంలో రైతులకు విద్యుత్ సరఫరా అందించాలి
వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి): గొండ్వానా సంక్షేమ పరిషత్(Gondwana Welfare Parishad ) ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రం విద్యుత్ కార్యాలయానికి(Central Electricity Office) విధుల నిర్వహణలో వచ్చిన జిల్లా అధికారి ఎస్ఈ జె.నరేష్(District Official SE J. Naresh)కి రైతులు సమస్యలపై వివరిస్తూ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పూనెం ప్రతాప్ మాట్లాడుతూ... వెంకటాపురం మండలంలో సబ్-డివిజన్ విద్యుత్ సరఫరా, నిర్వహణ, అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ లేక విద్యుత్ సరఫరా యొక్క పనులకు ఆటంకం కలుగుతుంది.
రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా అందడం ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొత్తగా విద్యుత్ త్రీఫేస్ లైన్ కోసం ఆదివాసి రైతులు(Tribal farmers) డీడీలు తీసి సంవత్సరం కాలం నడుస్తున్న విద్యుత్ సరఫరా అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వర్క్ శాంక్షన్లు ఆర్డర్లు తీసుకునే అధికారి లేకపోవడంతో కొత్త త్రీఫేస్ కనెక్షన్లు పనులు నిలిచిపోవడం జరిగింది.రాబోయే రోజుల్లో ఏలినో ప్రభావం తీవ్రంగా ఉండడం వలన అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ ని వెంటనే నియమించి,రైతులకు విద్యుత్ లైన్లు సకాలంలో అందించాలని కోరారు.