శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

16-10-2026 | 12:24am

గండీడ్,(విజయక్రాంతి): మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం(Reddypalli village)లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు(Devi Sharannavaratri Celebrations) భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి(Sri Lalita Tripura Sundari Devi) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.

అమ్మవారి ఆశీస్సులు పొందుతూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా మహిళలు నిర్వహించిన దాండియా నృత్యాలు నిలిచాయి. సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు ఉత్సాహంగా దాండియా నృత్యాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళల నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు