అక్రమ కలప రవాణా కేసులో ట్రాక్టర్ స్వాధీనం

16-10-2026 | 12:02am

సిరికొండ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా(Nizamabad district), సిరికొండ మండలం, దుప్య తండా గ్రామానికి చెందిన మాలావత్ తిరుపతి తండ్రి మంగ్య నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 23 టేకు కలప దుంగలకు(illegal teak wood) సంబంధించిన కేసులో విచారణ చేసి పాకాల గ్రామం మాలావత్ నీలా భర్త మోహన్‌కు చెందిన ట్రాక్టర్‌ను  గుర్తించి నట్లు ఎఫర్వో నర్సింగ్ రావు తెలిపారు. 

ఈ కేసులో ప్రధాన నిందితుడైన పాకాల గ్రామానికి చెందిన బాదావత్ నరేష్ తండ్రి రాజును అదుపులోకి తీసుకొన్నట్లు చెప్పారు. కలప యొక్క విలువ Rs. 89,683 ఉంటుందని చెప్పారు. అక్రమంగా కలప తరలించిన చెట్లను నరికివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు