ఉపవాసంతో ప్రార్థిస్తే అద్భుతాలు చూస్తాం

15-10-2026 | 11:56pm

మొదటి రోజు ఘనంగా ఉపవాస ప్రార్థనలు 

వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు 

ముఖ్య ప్రసంగీకులు పాస్టర్ జ్యోతి రాజ్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): దేవుని పట్ల మనం భారం కలిగి ఉపాసంతో ప్రార్థించినట్లయితే అద్భుతాలను చూస్తామని అంతర్జాతీయ ముఖ్య ప్రసంగీకులు పాస్టర్ జ్యోతి రాజ్(International speaker Pastor Jyothi Raj) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్ లో రెమ వర్షిప్ సెంటర్ డైరెక్టర్ పాస్టర్ బిఎస్ పరంజ్యోతి  అధ్యక్షతన మూడు రోజులపాటు  ఏర్పాటుచేసిన ఉపవాస ప్రార్థన పండుగలు(Fasting Prayer Festivals) మొదటి రోజు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా పాస్టర్ జ్యోతి రాజ్ ప్రసంగిస్తూ ఆనాడు బైబిల్ ను చూస్తే ఏలియా ఎలీషా అను ప్రవక్తలు ఉపవాసంతో దేవుని ప్రార్థించగా ఆకాశమందున్న దేవుడు అద్భుతాలు చేశాడని ఆయన గుర్తు చేశారు.  మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటేనని మన పట్ల ప్రేమ గల దేవుడు ఉన్నాడన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిందిగా సూచించారు. ఉపవాసంతో దేవుని వేడుకుంటే ఆయన వెంటనే జవాబు ఇచ్చే గొప్ప దేవుడని కొనియాడారు. ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన ఈ పండుగలు అద్భుతమని నిర్వాహకుడు పాస్టర్ బి ఎస్ పరంజ్యోతిని అభినందించారు.

వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు..

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఏలినో పరిస్థితుల్ని అధిగమించి సమృద్ధి వర్షాలను దేవుడు కురిపించాలని కోరుతూ ప్రతి ఒక్కరు భారంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు తిమోతి వేదాంతి నాగరాజు సుందర్ పాల్, రమేష్ బహదూర్, బలరాం,లక్ష్మన్న, మహేందర్, సిస్టర్స్ ఎస్తేర్, మార్తమ్మ, మహిమ, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు