ఎండు గంజాయి పట్టివేత

15-10-2026 | 11:47pm

ఇద్దరి అరెస్ట్‌.. బైక్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

గజ్వేల్‌: గంజాయి అక్రమ రవాణాపై గజ్వేల్‌ ఎక్సైజ్‌ పోలీసులు(Gajwel Excise Police) కొరడా ఝళిపించారు. వాహనాల తనిఖీల్లో 2.5 కిలోల ఎండు గంజాయి(dry ganja)ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఎక్సైజ్‌ సీఐ శిరీష(Excise CI Sirisha) ఆదేశాల మేరకు ఎస్సై శైలజ తన సిబ్బందితో బుధవారం గజ్వేల్‌ ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో గంజాయిని తరలిస్తున్న నిరాజ్‌ కుమార్‌ (20), బిపిన్‌ కుమార్‌ (24) పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన ఎక్సైజ్‌ సిబ్బంది వారిని పట్టుకున్నారు. నిందితులు బీహార్‌ రాష్ట్రానికి చెందినవారని, ప్రస్తుతం ములుగు మండలం తునికి బొల్లారం గ్రామంలో ఉంటున్నారని ఎస్సై శైలజ తెలిపారు.

వారి నుంచి 2.5 కిలోల ఎండు గంజాయితో పాటు హీరో ప్యాషన్‌ ప్లస్‌ మోటార్‌ సైకిల్‌, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను కలిగి ఉన్నా, విక్రయించినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్‌ సీఐ శిరీష హెచ్చరించారు.

మరిన్ని వార్తలు