జానపద సంస్కృతి మన మూలాలు

15-10-2026 | 07:02pm

కొత్తపల్లి, అక్టోబర్ 15(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ(Sankalpa Voluntary Service Organization) ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఫిలిం భవన్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి జానపద సాంస్కృతి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు మై భారత్ కార్యాలయంలో జిల్లా యువజన అధికారి గోలి తిరుపతిరెడ్డి చేతుల మీదుగా నేడు సర్టిఫికెట్లు అందించడం జరిగింది.

ఈ సందర్బంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కళాకారుల ప్రదర్శన ఎంత గొప్పగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు తెలంగాణ సంస్కృతికి జానపదం బతుకమ్మ బోనాలు మన వారసత్వానికి ప్రతిరూపాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు వలస సుభాష్ చంద్రబోస్ కరీంనగర్ జిల్లా సకల జేఏసీ జిల్లా కన్వీనర్ ఐల ప్రసన్న ,జిల్లా కో చైర్మన్ గజవెల్లి కిష్టయ్య,p సంకల్ప సంస్థ సభ్యులు కళాకారులు సదాలక్ష్మి, లక్ష్మి మౌనిక, లావణ్య లక్ష్మి, ధర్మేందర్ సత్యం ,శ్రీనివాస్, సౌజన్య  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు