ఇకపై ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లోనే

15-10-2026 | 06:57pm

నిర్మల్, అక్టోబర్ 15( విజయ క్రాంతి): జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ రిజిస్ట్రేషన్(Registration of Clinical Establishments) ప్రక్రియను ఇకపై ఆన్‌లైన్ విధానంలోనే చేపట్టాలని క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్(Clinical Establishments Act) తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరమణ తెలిపారు.

ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు, దరఖాస్తుల పరిశీలన మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం నిర్మల్‌ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్–2010 అమలు, ఆసుపత్రుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, సంబంధిత ఆసుపత్రుల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశించిన వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రులు చట్ట నిబంధనలకు అనుగుణంగా అవసరమైన వివరాలు, దృవపత్రాలను సమర్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.

రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ అధికారి సునీల్ రాజ్ , క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్–2010 ముఖ్య ఉద్దేశాలు, చట్టంలోని నిబంధనలు, వాటి అమలు విధానం, అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, ఆదిలాబాద్ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ సాధన, నిజామాబాద్ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ  ప్రోగ్రామ్ అధికారులు, డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారులు బారె రవీందర్, వెంకట్ రెడ్డి, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు