సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 15 (విజయ క్రాంతి):మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన మంగలి లక్ష్మయ్య, 25000,బేగరీ తేజస్వినిలకు 27,000 రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) పంపిణీ చేశారు.బైండ్ల లావణ్యకు మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కును(Kalyana Lakshmi cheque) కూడా పంపిణీ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశంసారం సిఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దారులకు పంపిణీ చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూమా యాద గౌడ్ మాట్లాడుతూ...కష్టకాలంలో సమయానికి భగవంతుడులా సహాయం అందిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమా యాద గౌడ్,ఎమ్మార్వో వెంకటరెడ్డి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రభాకర్, మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ సురేందర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంత్ రెడ్డి,వాసు రెడ్డి, మునిగేపల్లి సంగయ్య, అభిషేక్,లింగం,గులాబ్ హుస్సేన్, బోరంచ సాయిలు,సిద్ధూ,చింటూ, అమృత్ రావ్,లక్ష్మణ్ ఠాగూర్,వజ్ర నాయక్,వస్త్రం నాయక్,తదితరులు పాల్గొన్నారు.