ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి...

15-10-2026 | 06:48pm

తాడ్వాయి,అక్టోబర్,15( విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు(Two-wheeler riders) ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని తాడువాయి ఎస్సై నరేష్(Taduvai SI Naresh) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన గురువారం వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలని కోరారు.

ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ తలకు గాయాలు కాకుండా కాపాడుతుందని తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనానికి సరైన కాగితాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు