గుంతల రోడ్డుకు మరమ్మతులు

15-10-2026 | 07:00pm

ప్రజల భద్రతే లక్ష్యం: బూరుగుపల్లి సర్పంచ్ వెంకటలక్ష్మి

గజ్వేల్, అక్టోబర్15: రిమ్మనగూడ నుంచి బూరుగుపల్లి వెళ్లే రహదారి గుంతలమయమై వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి(Village Sarpanch Venkatalakshmi) ఆధ్వర్యంలో పాలకవర్గం స్పందించింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డుపై ఉన్న గుంతలను కాంక్రీట్‌తో పూడ్చే పనులు చేపట్టారు.

రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోల్లో ప్రయాణించే వారు, విద్యార్థులు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. అయితే, కెనాల్‌ బ్రిడ్జి వద్దతో పాటు రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రయాణ ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కిషోర్‌రెడ్డి, నాయకులు సీహెచ్. రాజు, వార్డు సభ్యులు భాస్కర్‌రెడ్డి, రజినీకాంత్, కిరణ్, అరవింద్‌రెడ్డి, స్వామి, సాయిలు, నర్సింలు, శివులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు