అబ్దుల్ గనికి పదోన్నతి

29-09-2026 | 09:43pm

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్(Head Constable) గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ గనికి  ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. 1990లో వేంసూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన గని అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. 2016లో ములకలపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అతనికి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన గనీ కొత్తగూడెం వన్ టౌన్, ఆ తర్వాత పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా అతనికి హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ గా ప్రమోషన్ లభించింది. సౌమ్యుడిగా, వివాదరహితుడుగా విధులు నిర్వహిస్తూ అందరి మన్నాళ్లు పొందటం అతని ప్రత్యేకత.

మరిన్ని వార్తలు