రైతుల నుంచి కన్సెంట్ (సమ్మతి) పత్రాలు స్వీకరణ
ఘట్ కేసర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఘట్‌కేసర్ సర్కిల్ లోని కాచవానిసింగారం, ముత్వేల్లిగూడ, ప్రతాప్ సింగారం, కొర్రెముల, ఎదులాబాద్ గ్రామాల్లో మంగళవారం తహసిల్దార్ భీమర్తి చంద్రశేఖర్(Tahsildar Bhimarthi Chandrashekar) ఆదేశాల మేరకు గ్రామసభలు నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ కోసం రెవెన్యూ అధికారులు ఐదు గ్రామాల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి రైతుల నుంచి కన్సెంట్ (సమ్మతి) పత్రాలు స్వీకరించారు.
హెచ్ఎండీఏ రైతు నుంచి తీసుకున్న ఎకరా భూమికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి 50-50 లేదా (1400 గజాల స్థలం), బఫర్లో ఉన్న ఎకరం భూమికి గాను 800 గజాలు, ఎఫ్ టీల్ ఉంటే 400, వివాదస్పద ఆక్రమణలు (ఎన్ క్రోచ్ మెంట్) ఉంటే 300 గజాల స్థలాన్ని రైతులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆసక్తి గల రైతులు తమ భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద సమ్మతి పత్రాలు ఇవ్వాలని తహసీల్దారు కోరారు. ల్యాండ్ పూలింగ్ పై పదిరోజుల పాటు గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలి పారు. ల్యాండ్ పూలింగ్ పై ఏమైన సందేహాలుంటే గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ను లేదా తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారును కలిసి సమ్మతి పత్రాలు అందజేయాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.