అంగన్‌వాడీల్లో ఆటపాటలతో పోషణపై అవగాహన
- ఆట పాటల మధ్య చిన్నారుల సందడి
- ఇంటి వంటతో పౌష్టిక బలం..అంగన్ వాడిలో అవగాహన
గరిడేపల్లి, సెప్టెంబర్ 29,(విజయ క్రాంతి): ఇంటి వంటతో పౌష్టిక బలం లభిస్తుందని, స్వయంగా తయారు చేసుకునే పౌష్టికాహారంతో(Nutrition) ఆరోగ్యవంతమైన పదార్థాలను అర్హులైన లబ్ధిదారులు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి తాళ్ల మల్కాపురం గ్రామ సర్పంచ్ కుర్రి మహేష్,అంగన్వాడి టీచర్లు అన్నారు.మండలంలోని తాళ్ల మల్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో 9వ పోషణ మాస కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తల్లులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.స్థానికంగా లభించే ధాన్యాలు, ఆకుకూరలు, పప్పులు, పిండివంటలు తదితర పదార్థాలతో తక్కువ ఖర్చుతోనే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇంటివద్దే తయారు చేసుకోవచ్చని అంగన్‌వాడీ సిబ్బంది సూచించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన ప్రీ-స్కూల్ విద్యను అందిస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చిన్నారులతో ఆటలు, పాటలు నిర్వహించి పోషణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రైలు, హెడ్‌మాస్టర్ సైదిరెడ్డి, డాక్టర్ అశోక్, ఏఎన్‌ఎం రేణుక, అంగన్‌వాడీ టీచర్లు పద్మమ్మ, వై. నాగలక్ష్మి, డి. ఝాన్సీ, బి. పద్మ, ఆయాలు ఆర్. గుర్వమ్మ, లక్ష్మి, గర్భిణులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.