రాష్ట్రస్థాయి పోటీలకు బెజ్జంకి విద్యార్థుల ఎంపిక
బెజ్జంకి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అత్యపాత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో హుస్నాబాద్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల(Telangana Social Welfare Residential Girls School) (బెజ్జంకి)లో చదువుతున్న భావన, అమూల్య, ఇంటర్ ప్రథమ సంవత్సరం కీర్తిప్రసన్న పొత్తూరి తన్మయి 9వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఆత్యపాత్య పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వీరలక్ష్మి తెలిపారు.
సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఆత్యపాత్య పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపీకయ్యారు. జగిత్యాల జిల్లాలో అక్టోబర్ 11, 12 తేదీలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అత్యపాత్య పోటీల్లో వారు పాల్గొననున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల బృందం విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు శిక్షణ అందించిన పీడీ శౌరి, పీఈటీ శ్రీలతను ప్రిన్సిపాల్ వీరలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ విజయ అభినందించారు.