మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలిగా కృష్ణవేణి

29-09-2026 | 10:14pm
  1. ఉపాధ్యక్షుడిగా పోశన్నసర్పంచ్ సంఘం మండల అధ్యక్షురాలిగా కృష్ణవేణి
  2. ఉపాధ్యక్షుడిగా దుర్గం పోశన్న ఏకగ్రీవ ఎన్నిక

పెంచికల్‌పేట్ ( విజయక్రాంతి ): మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలిగా దరోగపల్లి సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణి–హరీష్, ఉపాధ్యక్షుడిగా పోతేపల్లి సర్పంచ్ దుర్గం పోశన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు కృష్ణవేణి మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మండల సర్పంచ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు