మహిళ ఫిర్యాదు మేరకు వైద్యుడిపై కేసు నమోదు

15-10-2026 | 08:07pm

అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన చుంచుపల్లి పోలీసులు

చుంచుపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్(Chunchupalli Police Station) పరిధిలో వైద్యం పేరుతో తనను వేధింపులకు గురిచేశాడని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాక్టర్ నాడికూడి శైలేష్ కుమార్ (39)పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.నిందితుడు కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని శ్రీ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు.

మహిళ ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 114/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా అక్టోబర్ 15వ తేదీ తెల్లవారుజామున విద్యానగర్ కాలనీ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది.

మరిన్ని వార్తలు