పాఠశాలల్లో డీఈఓ తనిఖీ
టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) విద్యాశాఖ అధికారిణి వాసంతి మంగళవారం టేకులపల్లి మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు(Mandal Parishad primary schools) టేకులపల్లి, వెంకటయ్యతండాలను సందర్శించారు. టేకులపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కే. వెంకయ్య బోధనను పరిశీలించి పలు సూచనలు చేశారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, తదుపరి సందర్శనలోపు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం వెంకటయ్యతండా ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం ఏ. వెంకట్రావు బోధనను పరిశీలించారు. బోధనపై సంతృప్తి వ్యక్తం చేసి, పాఠశాల రికార్డులను తనిఖీ చేస్తూ తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి టి. మాధవరావు, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ సభ్యుడు అల్లూరిరెడ్డి, టేకులపల్లి ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు (ఎఫ్‌ఏసీ) ఎం. మోహన్‌రావు పాల్గొన్నారు.