ఆలూరులో ప్లాస్టిక్ నిషేధం

15-09-2026 | 10:30pm

నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్‌ మండలం(Sarangapur Mandal) ఆలూరు గ్రామంలో సర్పంచ్‌ ఇర్ల చిన్నయ్య ఆధ్వర్యంలో మంగళవారం ప్లాస్టిక్ నిషేధిస్తూ తీర్మానం(Resolution banning plastic) చేశారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీనివాస్‌, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌ పాల్గొని గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీపీఓ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

చెత్తబుట్టలను ఇతర అవసరాలకు వినియోగించకుండా పారిశుధ్య నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులకు ప్రత్యామ్నాయంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్టీల్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారని, గ్రామంలో జరిగే శుభకార్యాలు, ఇతర సామూహిక కార్యక్రమాలకు అవసరమైన స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులను ఇక్కడి నుంచి వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు