ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై గీతం సిబ్బందికి శిక్షణ

26-11-2026 | 07:14pm

పటాన్ చెరు, నవంబర్ 26: హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో(GITAM Deemed University) బోధనేతర సిబ్బందికి ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 25, 26 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఏఐఏ నిపుణుడు మెహుల్ షా వృత్తిపరమైన సంభాషణ పద్ధతులు, ఈమెయిల్ మర్యాదలు, వాట్సాప్ వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. స్పష్టత, మర్యాద, గోప్యత, ధృవీకరించని సమాచారాన్ని ఫార్వార్డ్ చేయకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని సాను జకారియా, డి.ఎం. ప్రియాంక సమన్వయం చేశారు.

గీతంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘రాజ్యాంగ ప్రతిధ్వనులు’ ఇతివృత్తంతో వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు రాజ్యాంగ పీఠిక పఠనం, కళా ప్రదర్శనలు, చర్చలు, ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని చాటారు. బాధ్యతాయుత పౌరులుగా తమ పాత్రను గుర్తించేలా ఈ కార్యక్రమం సాగింది.

మరిన్ని వార్తలు