ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

26-11-2026 | 07:08pm

తాడ్వాయి,నవంబర్,26( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజి వాడి గ్రామంలో(Sangojis village) గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నినాదాలు చేశారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలోని పేదలకు న్యాయం జరిగిందని తెలిపారు.

ఆయన సేవలు మరువలేనిన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గైని శివాజీ, నాయకులు గంట బాలరాజు,ఎండి ఖయ్యూం,ఎండి కారమాత్,హైమద్, ఫారూఖ్,సందీప్, భరత్ కుమార్,బాల పోచయ్య చిన్న నర్సింలు,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు