పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

26-11-2026 | 07:21pm

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation ) పరిధిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ(Jyotirao Phule Statue) ఏర్పాటుకు స్థలం కేటాయించి, విగ్రహ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తూ కార్పొరేషన్ కౌన్సిల్‌లో అధికారిక తీర్మానం చేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ కోరారు. గురు వారం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మధుకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. సమాజంలో విద్య ద్వారానే మార్పు సాధ్యమని నమ్మి, మహిళలకు విద్య అందించేందుకు విశేష కృషి చేసిన మహనీయుడు పూలే అని పేర్కొన్నారు.

గత పది సంవత్సరాలుగా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో, ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వివిధ సందర్భాల్లో విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అధికారిక అనుమతులు, కార్పొరేషన్ తీర్మానం జరగలేదన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సామాజిక సేవలు, ఆయన ఆశయాలు భావితరాలకు నిరంతరం గుర్తుండేలా మంచిర్యాల పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికైనా ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకొని మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో అనువైన స్థలాన్ని కేటాయించాలని, రాబోయే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాలో చేర్చి విగ్రహ ఏర్పాటుకు అనుకూలంగా అధికారిక తీర్మానం చేయించాలని, విగ్రహ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకులు వెల్ది సుదర్శన్, బీసీ సమాజ్ జిల్లా నాయకులు కర్ణకంటి రవీందర్.

ది విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగంటి శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజాచారి, బీసీ సమాజ్ జిల్లా నాయకులు బియ్యాల సత్తయ్య. జక్కం రవీందర్, పెద్దపల్లి సూరయ్య. సంద ప్రభాకర్. మాడిశెట్టి మహేష్, కొండు రాజు, చల్ల విజయ్ కుమార్, తాటిపాముల సమ్మయ్య, వెన్నంపల్లి మురళి, గుండ్ల లక్ష్మణ్, ముదెపల్లి రమేష్, వేముల నాగరాజు, పల్లపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు